ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో బుధవారం డీఎస్పీ కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం జరిగింది. ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికాగర్ ఆదివారం 22వ తేదీన జరగబోయే పోలీసు రాత పరీక్షకు సంబంధించి మొత్తం 7,841 అభ్యర్థులు ఉన్నారన్నారు. మార్కాపురంలో 21 సెంటర్లు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రానికి సరైన సమయానికి రావాలని, ఆలస్యంగా వచ్చిన వాళ్లను పరీక్షకు అనుమతించబడదన్నారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు హాల్ టికెట్ మాత్రమే తీసుకొని రావాలని సూచించారు. 21 పరీక్ష కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తుతో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.