పర్చూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ను బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఆ గ్రామానికి చెందిన చిరువ్యాపారులు కలుసుకొని తమ సమస్యలు చెప్పుకున్నారు. ముఖ్యంగా పర్చూరు- పాత చెన్నై ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణ వల్ల తాము ఉపాధి ఉపాధి కోల్పోతామని వారు ఆయన ఎదుట వాపోయారు. దశాబ్దాల తరబడి తాము ఈ రోడ్డు మార్జిన్లలో వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల పేరిట ఈ రోడ్డును విస్తరించి తమను అక్కడినుండి తొలగించబోతున్నారని, తమకు న్యాయం చేయాలని చిరు వ్యాపారులు ఆమంచిని కోరగా తాను అధికారులతో మాట్లాడి అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.