బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాలనే సదుద్దేశంతో జగనన్న ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా పేర్కొన్నారు. పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం గ్రామపంచాయతీ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి అందుతున్నాయా లేదా అనే విషయాన్ని ఆమె ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగసముద్రం సర్పంచ్ చిత్త రవి ప్రకాష్ రెడ్డి, గిరి ప్రణీత్ రెడ్డి, వైసిపి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.