యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఈనెల 19వ తేదీన “వేమన జయంతి ఉత్సవం” నిర్వహిస్తున్నట్లు తెలుగు శాఖ అధిపతి ఆచార్య జి. పార్వతి బుధవారం ఒక ప్రకటనలో విశ్వవిద్యాలయం నుంచి పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె. హేమచంద్రారెడ్డి హాజరవుతారని సభాధ్యక్షులుగా విశ్వవిద్యాలయం బాధ్య ఉపకులపతి ఆచార్య జి. రంగ జనార్దన్, ప్రత్యేక ఆహ్వానితులుగా వై వి యు కుల సచివులు ఆచార్య వై. పి. వెంకటసుబ్బయ్య, ప్రధాన ఆచార్యులు ఆచార్య కె. కృష్ణారెడ్డి హాజరవుతున్నారని వివరించారు.
ప్రధాన వక్తగా మైసూరు లోని కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం పీఠాధిపతి ఆచార్య ఎం. రామనాథం నాయుడు హాజరై కీలక ఉపన్యాసం చేస్తారని తెలిపారు. యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధిపతి ఆచార్య జి. పార్వతి సభా సమన్వయం చేస్తారన్నారు. ఈ సందర్భంగా అతిధులచే వేమన విగ్రహానికి పుష్పమాలాలంకరణ, వేమన చైతన్య యాత్ర (ర్యాలీ) వేమన నాటిక ప్రదర్శన, పద్య గానం కార్యక్రమాలు ఉంటాయన్నారు.