ప్రత్యక్షదైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని బుధవారం ఉదయం దేవదాయ ధర్మదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎం. వి. సురేష్ బాబు దేవాలయంనకు విచ్చేసి శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామి వారి జ్ఞాపికను ఆలయ ఈవో వి. హరి సూర్య ప్రకాష్ అందజేశారు. అనంతరం దేవదాయ ధర్మదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎం వి సురేష్ బాబు, శ్రీకాకుళం జిల్లా ఎస్ పి జి ఆర్ రాధిక సంయుక్తంగా రథసప్తమి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ పరిసర ప్రాంతాలను, ఆలయం ఎదురుగ ఉన్న ఇంద్రపుష్కరిణిని, ఉచిత దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం మార్గాలను పరిశీలించారు. తదుపరి ఆర్జెసి సురేష్ బాబు మాట్లాడుతూ రథసప్తమి రోజు దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యములు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని క్యూ లైన్స్ లో ఉండే భక్తులకు మంచినీరు, పాలు అందజేస్తామని తెలిపారు. తదుపరి జిల్లా ఎస్ పి జి ఆర్ రాధిక మాట్లాడుతూ క్యూ లైన్స్ పగడ్బందిగా ఏర్పాటు చేయాలని, వృద్ధులకు, వికలంగులకు, పిల్లలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పాదరక్షకులు భద్రపరచుటకు భక్తులకు సదుపాయములు కల్పించాలని, కెమెరాలు, మొబైల్ ఫోన్స్ ఆలయం లోపలకి అనుమతించకుండా భద్రపరచుటకు క్లాక్ రూమ్స్ ఏర్పాటు చెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ అధికారి డి వి వి ప్రసాదరావు గారు, శ్రీకూర్మం కార్యనిర్వహణాధికారి జి. గురునాధ్ రావు, శ్రీకాకుళం జిల్లా డిఎస్పీ మహేంద్ర, డిఎస్పీ శ్రీ బాలరాజు, 1 టౌన్ సిఐ ఎల్ ఎస్ నాయుడు, 1 టౌన్ ఎస్ఐ గణేష్, ఆలయ ఇంచార్జ్ సూపరింటెండెంట్ కె. వెంకటేశ్వరరావు, ఆలయ జూనియర్ అసిస్టెంట్ బి ఎస్ చక్రవర్తి , జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గున్నారని ఆలయ ఈవో వి. హరి సూర్య ప్రకాష్ తెలిపారు.