ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ 20 కోట్లతో రాజాం ప్రధాన రహదారి విస్తరణ పనులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 18, 2023, 04:43 PM

విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం పర్యటించారు. రాజాం పట్టణంలో రూ. 20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ప్రధాన రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేసారు. అనంతరం రహదారి విస్తరణ పనులపై అధికారులతో సమీక్ష సమావేశం మంత్రి బొత్స సత్యనారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, ఎం. పి. బెల్లాన చంద్రశేఖర్, శాసన సభ్యులు కంబాల జోగులు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com