బాపట్ల జిల్లాలో రహదారి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్ లోని ఆమె ఛాంబర్ లో 34 వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈనెల18వ తేదీ నుండి 24 వ తేదీ వరకు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను నిర్వహించాలన్నారు. రవాణాశాఖ అధికారులు ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ రోజువారీ కార్యక్రమాలను అమలు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఎం. చంద్రశేఖర్ రెడ్డి, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు పి. అంకమ్మ రావు, బి. వి. రంగా రావు, ఎన్. ప్రసన్న కుమారి, ఎ. ఓ ఉషా, తదితరులు పాల్గొన్నారు.