ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు దువ్వాడ పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం. అగనంపూడికి చెందిన నెల్లి తాతారావు (30) ఆర్థిక ఇబ్బందుల కారణంగా బుధవారం రాత్రి అప్పికొండ సమీపంలోని సరుగుడు తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాతారావు ఓ ఫార్మా కంపెనీలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహేచ్కు తరలించారు. మృతుని భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.