వందేభారత్ ఎక్స్‌ప్రె్‌సలో విమానం స్థాయిలో సదుపాయాలు ఉన్నాయని ఊదరగొట్టినప్పటికీ ప్రయాణికుల నుంచి ఆశించినంత స్పందన కానరావడం లేదు. సికింద్రాబాద్ నుంచి విశాఖకు నడిపే సూపర్‌ఫాస్ట్ రైళ్లలో దురంతో ఎక్స్‌ప్రెస్ అతి ముఖ్యమైనది. దురంతో రైళ్లలో బుధవారం, శనివారం వెయిటింగ్ లిస్టులు కనిపిస్తున్నాయి. దీనిలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. అన్నీ స్లీపర్ బెర్తులే. దురంతోలో ఫస్ట్ ఏసీ టికెట్ ధర రూ.2,800, సెకండ్ ఏసీ రూ.2,300, థర్డ్ ఏసీ రూ.1,630గా ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్ కూడా గంటకు 130 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖకు 10 గంటల 10 నిమిషాల వ్యవధిలో చేరుకుంటుంది.
ఇక వందే భారత్ రైలు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు రూ.3,170గా ఉంది. గంటకు 180 కిలోమీటర్ల మేర ప్రయాణించే సత్తా ఉన్నా మన రూట్‌లో మాత్రం 130 కిలోమీటర్ల వేగ పరిమితిని విధించారు. ఇందులో స్లీపర్ బెర్తులు ఉండవు. అన్నీ చైర్ సీటింగ్ మాత్రమే ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి 8.30గంటల ప్రయాణంతో విశాఖకు చేరుకోవచ్చు. దురంతోతో పోల్చుకుంటే గంటా 40 నిమిషాలు ముందుగా వందేభారత్‌లో ప్రయాణించవచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత సగటు ప్రయాణికుడు వందేభారత్ కంటే దురంతో వైపే ఆసక్తి చూపిస్తున్నారు. గంటన్నర వ్యత్యాసానికి అంత డబ్బు చెల్లించి వందేభారత్‌లో వెళ్లే కంటే ఇతర సూపర్‌ఫాస్ట్ రైళ్లలో ప్రయాణించడం మేలని భావిస్తున్నారు. వందేభారత్‌లో 1,128 సీటింగ్‌కు కాను 1,050 సీట్లు చైర్‌కార్ సదుపాయంతో ఉన్నాయి. మిగిలినవి ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు కేటాయించారు.