నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33వ డివిజన్ లో పారిశుద్ధ్య కార్మికులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇంచార్జ్ కరణం హాజరత్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన బట్టల పంపిణీ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదల్ రాష్ట్ర అధ్యక్షులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు కార్పొరేషన్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు పడుతున్న కష్టం మరువలేనిదన్నారు. కరోనా సమయంలో వారి చేసిన సేవలు ఎనలేనివన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు సహాయంగా హజరత్ నాయుడు ముందుకు వచ్చి బట్టలను పంపిణీ చేయడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కరణం మంజుల, వైసీపీ నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.