రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కృష్ణ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ అన్నారు. అవనిగడ్డలో జరిగిన నియోజకవర్గ స్థాయి విస్తృతకార్యకర్తల సమావేశంలో రాష్ట్ర మత్స్యకార వికాస విభాగం అధ్యక్షులు బొమ్మిడి నాయకర్తో కలసి బండ్రెడ్డి రామకృష్ణ పాల్గొన్నారు. అధికార పార్టీ నాయకులు జనసేన పార్టీని బెదిరించాలని చూడటం అవివేకమన్నారు ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా రానున్న ఎన్నికల్లో జనసేన విజయాన్ని ఎవరు ఆపలేరన్నారు. చెన్నగిరి సత్యనారాయణ అధ్యక్షత వహించగా, ముఖ్యనేతలు మత్తి వెంకటేశ్వరరావు, బాసు నాంచారయ్య నాయుడు, రాయపూడి వేణుగోపాల్, గుడివాక శేషుబాబు, తిమోతి, యుగంధర్, కిషోర్, శివరామకృష్ణ, కృష్ణాంజనేయులు, గాజుల శంకరరావు తదితరులు పాల్గొన్నారు.