గుంతకల్లు పట్టణంలో పలు వీధుల్లో బైక్ దొంగతనాలకు పాల్పడిన ఒక దొంగను వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 6 లక్షల విలువ చేసే 13 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. స్ధానిక వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వన్‌టౌన్ సీఐ రామసుబ్బయ్య అ రెస్టు వివరాలను వెల్లడించారు. హనుమేష్ నగర్లో నివా సముంటున్న గౌని నరేంద్ర రెడ్డి పట్టణంలో 9 నెలల నుంచి పలు ప్రాంతాల్లో బైక్‌లను దొంగతనాలు చేశాడన్నారు. బైక్‌లను అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుంటా డన్నారు. స్థానికంగా బైక్‌ను అపహరించి బళ్లాకి వెళుతుం డగా హనుమాన్ సర్కిల్ ఉదయం 8 గంటలకు పోలీసులు వాహనాలు తనిఖీలో పట్టుబడ్డాడన్నారు. వేర్వేరు ప్రదేశాల్లో దాచి పెట్టిన 13 బైక్‌లను అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇతనిపై బళ్లారిలో పలు కేసులున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టూటౌన్ సీఐ గణేష్, ఎస్ఐలు మరారిబాబు, అంజినప్ప, తిరుపాల్, హెడ్‌కానిస్టేబుల్ వెంక టేష్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.