కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో బుధవారం ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడు చనిపోగా మరో బాలుడి కాలు నుజ్జునుజ్జయింది. వివరాల్లోకి వెళితే .... రౌతలపూడి మండలం డి.జె పురానికి చెందిన బర్ల రమణ భార్య లక్ష్మి, కుమారులు దుర్గాప్రసాద్, గంగరాజులతో కలసి బైక్ మీద ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంలో అత్తా రింటికి వెళ్లి తిరిగి ప్రయాణమవుతుండగా అన్నవరం శివారున ఉన్న స్నేహ రెసిడెన్సీ వద్ద విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో దుర్గాప్రసాద్ (6) అక్కడికక్కడే మృతిచెందగా మరో కుమారుడు గంగరాజు కాళ్లకు తీవ్రగాయాలు, భార్య,భర్తలకు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని అన్నవరం ఎస్.ఐ శోభన్‌కుమార్ పరిశీలించి కేసు నమోదు చేశారు.