హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా టీ21 ట్యాబ్లెట్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 10.36 అంగుళాల డిస్ ప్లేతో కూడిన ఈ ట్యాబ్లెట్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ తో ఉంటుంది. చార్ కోల్ గ్రే కలర్ తో వస్తుంది. 8,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 800 చార్జింగ్ సైకిల్స్ పూర్తయిన తర్వాత కూడా ఈ ట్యాబ్లెట్ బ్యాటరీ 80 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అంటే దీర్ఘకాలం పాటు మన్నికగా ఉంటుందని పేర్కొంది.
డిస్ ప్లే 2కే రిజల్యూషన్, లో బ్లూలైట్ సర్టిఫికేషన్ తో ఉంటుంది. కనుక కంటిపై శ్రమ తక్కువగా ఉంటుంది. ఇందులో వెనుక భాగంలో, ముందు భాగంలోనూ 8 మెగాపిక్సల్ కెమెరాలు ఉంటాయి. ఈ నెల 22 నుంచి అన్ని ప్రముఖ రిటైల్ దుకాణాల్లో ఇది అందుబాటులో ఉంటుందని హెచ్ఎండీ గ్లోబల్ తెలిపింది. ఈ ట్యాబ్లెట్ కేవలం వైఫై వేరియంట్ అయితే రూ.17,999. ఎల్టీఈ, వైఫై రెండింటినీ సపోర్ట్ చేసే వేరియంట్ ధర రూ.18,999. నోకియా డాట్ కామ్ పోర్టల్ లో ముందుగా బుక్ చేసుకుంటే రూ.1,000 డిస్కౌంట్ ఇస్తోంది. మూడేళ్ల పాటు నెలవారీ సెక్యూరిటీ అప్ డేట్స్ ను ఈ ట్యాబ్లెట్ కు ఇవ్వనున్నట్టు కంపెనీ తెలిపింది.