ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ పదోన్నతుల వివాదంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చించారు. కొద్దిసేపటికే సమావేశం ముగిసింది. దీనిపై మంత్రి సమగ్ర సమాచారం ఇచ్చారు.పదోన్నతులపై ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించినట్లు వెల్లడించారు.3వ తరగతి నుంచే విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లు ఉండాలన్నది ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. అందుకు 12 వేల మంది సబ్జెక్టు టీచర్లు అవసరమని గుర్తించామని బొత్స పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితిలో కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమ స్వప్రయోజనాల కోసం ప్రభుత్వంపై కోర్టుకు వెళ్లారని అసంతృప్తి వ్యక్తం చేశారు.