ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ మోసం కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ దూత్ కు బాంబే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గత నెల 26న సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేయగా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని.. మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అంతకు ముందు సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది.