భోజనం చేశాక 30 నిమిషాల తరువాత గ్రీన్ టీ తాగితే నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే భోజనం తర్వాత రెండు లవంగాలను నోట్లో వేసుకుని చప్పరిస్తే నోటి దుర్వాసన అనేదే ఉండదు. భోజనం చేశాక చివర్లో పెరుగన్నం తింటే మంచి ఫలితం ఉంటుంది. భోజనం అయ్యాక టీస్పూన్ సోంపు తిన్నా నోటి దుర్వాసన తగ్గిపోయి నోరు ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే భోజనం చేశాక నీటితో నోటిని పుక్కిలించినట్లైతే దుర్వాసన అనేది పోతుంది.