అధికార పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలు, దౌర్జనాలను ప్రశ్నిస్తే బీజేపి నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తారా అని భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పొలంకి రామస్వామి అన్నారు. గురువారం స్థానిక బీజేపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అయన మాట్లాడుతూ.... వైసీపీ నాయకుల దాడులు రోజు రోజుకూ మితి మీరి పొతున్నాయన్నారు. పోలీసులు కూడ వారితో కుమ్మక్కై బాధితులు స్టేషన్కు వెళితే కేసులు నమోదు చేయడం లేదన్నారు. వెల్దుర్తి మండల బీజేపీ అధ్యక్షుడుపైన దాడికి పాల్పడితే పోలీసులు పట్టించుకోకవడం దారుణమని అన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాళింగి నరసింహ వర్మ, బీజేపీ సంచార జాతుల రాష్ట్ర కన్వీనర్ అర్. చంద్రశేఖర్ పాల్గొన్నారు.