ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కు మరో అవకాశం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. వెస్ట్ నియోజకవర్గ పరిధి 52వ వార్డులో అయన శుక్రవారం బీజేపీ నాయకులతో పట్టభద్రుల ఓటర్లును కలిసి తమ తొలి ప్రాధాన్యత ఓటును బీజేపీకి వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, భోగది సోమినాయుడు, పశ్చిమ బీజేపీ కో ఆర్డినేటర్ దాడి పురుషోత్తం రమేష్, మండల అధ్యక్షుడు గొట్టిపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.