నగరంలోని కత్తెర వీధిలో డీసీఎంఎస్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ ను రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులకు శుభాకాంక్షలు అందజేశారు. సంస్థ ఆదాయం పెంచేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇటువంటివి ఎంతగానో ఉపయోగడతాయని అన్నారు. ప్రభుత్వ సంస్థలు నడుపుతున్న వారు తప్పనిసరిగా చట్టాలు, నిబంధనలు తెలుసుకొని ఉండాలి అని సూచించారు.
డీసీఎంఎస్ చైర్మన్ ఎస్. సల్లా సుగుణ దేవరాజ్, డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, ఎంపిపి గోండు రఘురాం, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గోండు కృష్ణ, డాక్టర్ పైడి మహేశ్వరరావు, సుంకరి కృష్ణ, ముంజేటి క్రిష్ణ, నర్తు నరేంద్ర, చల్లా అలివేలు మంగ, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.