34వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా ఈ రోజు కావలి పట్టణంలోని ఐదు లాంతర్ల సెంటర్ వద్ద ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ప్రతీ ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమం లో కావలి ఆర్డీఒ శీనానాయక్, కావలి డిఎస్పీ వెంకటరమణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుందర్ రావు పాల్గొన్నారు.