రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్య తీవ్రంగా గాయపడిన సంఘటన 216 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. కోనసీమ జిల్లా మల్కీపురం మండలం కేసనపల్లి గ్రామానికి చెందిన ఆడబాల వరప్రసాద్ (బుజ్జి) (51), వరలక్ష్మి దంపతులు స్వగ్రామం నుంచి విజయవాడ కారులో సొంతకారులో వెళ్తూ, గరిశపూడి వద్ద ఎదురుగా వస్తున్న నర్సాపురం ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. వరప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య వరలక్ష్మి తీవ్రంగా గాయపడింది. ఆమెను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వరప్రసాద్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్సై గణే్‌షకుమార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa