మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు గురువారం విజయవాడ నగరానికి వచ్చిన సందర్భంగా బుద్దా వెంకన్న కా ర్యాలయంలో ఆయన్ను టీడీపీ బీసీ నేతలు ఘనంగా సత్కరించారు. అంతకుముందు బుద్దా, అయ్యన్నపాత్రుడు వెంకన్న నివాసంలో సుదీర్ఘ చర్చలు జరిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడం, బీసీల ప్రముఖ పాత్ర, ఎన్నికల వ్యూహం వంటి అంశాలపై చర్చించుకున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి వెన్నుముకగా ఉన్న బీసీలు పార్టీ గెలుపుకోసం క్రియాశీలక పాత్ర వహించాల్సి ఉంటుందని, వారిని ఇప్పటినుంచే చైతన్య పరిచేందుకు కార్యక్రమాల రూపకల్పన జరగాల్సిన ఆవశ్యకతను చర్చించారు. త్వరలో బీసీల ప్రాంతీయ సదస్సులను నిర్వహించడానికి సంకల్పించారు. అనంతరం అయ్యన్న పాత్రుడు రాష్ట్రంలో జగన్ పాలనలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను దుయ్యబట్టారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో టీడీపీ బీసీ నేతలు ఆయ్యన్న పాత్రుడిని సత్కరించారు. కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, పార్టీ నేతలు కామా దేవరాజ్, కే హనుమంతరావు, కొండా, నాగోతి రామారావు, పేరాబత్తుల రమణ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa