ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు పంటనష్టాన్ని అందించే పరిస్థితిలో ప్రభు త్వం లేకపోవటం దారుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 02:33 PM

బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, చీమకుర్తి నియోజకవర్గ ఇన్‌ చార్జి బీఎన్‌.విజయ్‌కుమార్‌ తెలిపారు. ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలం రామచంద్రాపురం గ్రామంలో ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమాన్ని టీడీపీ ఆధ్వ ర్యంలో గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన విజయ్‌కు మార్‌ గ్రామంలో ఇంటింటా తిరుగుతూ వారి స మస్యలను నమోదు చేసుకున్నారు. రాబోయే ఎ న్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమని చెప్పారు. చం ద్రబాబునాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులకు పంటనష్టాన్ని అందించే పరిస్థితిలో ప్రభు త్వం లేకపోవటం దారుణమని విమర్శించారు. విద్యుత్‌, పెట్రోల్‌, ఆర్టీసీ చార్జీలు భారీగా పెంచడం, నిత్యావసరధరలు పెరగంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవటం అన్యాయమన్నారు. కార్యక్రమంలో నాయకులు మన్నం ప్రసాద్‌, పుట్టా బ్రహ్మ య్య, గొల్లపూడి సుబ్బారావు, మద్దినేని హరిబాబు, వేల్పుల శ్రీనివాసరావు, కూనంనేని లోకేష్‌, పమిడి రమేష్‌, కడియాల సుబ్బారావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa