ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 02:34 PM

ప్రకాశం జిల్లా, దర్శి పట్టణంలోని క్రిష్టియన్‌పాలేనికి చెందిన పీ సంద్య(20) బుధవారం రాత్రి ఇంటిలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే...... సంధ్యకు ఆరు నెలల క్రితం కె. సంపత్‌ కుమార్‌తో వివాహమైంది. అతను తరచూ మద్యం సేవిస్తుండటంతో సంధ్య వారిస్తూ వచ్చింది. ఆమె మాటను పట్టించుకోకపోవటంతో మనస్తాపం చెంది ఇంటిలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలాన్ని తహసీల్దార్‌ ఎం శ్రావణ్‌కుమార్‌, సీఐ రామకోటయ్య, ఎస్సై డీ రామకృష్ణలు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa