కడప జిల్లా, రామసముద్రం, మండలంలోని ఆర్‌నడింపల్లె పంచాయతీలోని బల్లసముద్రంకు చెందిన గణేష్ భార్య అమృత (38) గురువారం ఊరి పక్కనున్న చెరువులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు పుంగనూరు సమీపంలోని సీమనపల్లెకు చెందిన అమృతకు బలసంద్రంకు చెందిన గణేష్ తో మూడేళ్ల క్రితం వివాహ జరిగింది. వీరు బల్లసముద్రంలో కాపురం ఉంటున్నారు. కాగా గత శనివారం అమృత కనపించలేదని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అమృత కోసం గాలించినా ఆ చూకీ దొరకకపోవడంతో గత ఆదివారం స్థానిక పోలీసుస్టేషనలో ఫిర్యాదు చే శారు. ఈ నేపధ్యంలో గురువారం బలసముద్రం పక్కనున్న చెరువులో అమృత మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందు కున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చెరువు నుంచి వెలికి తీసి పంచనామా నిర్వహించి శవపరీక్షల కోసం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అమృత భర్త గణేష్, అత్త రెడ్డెమ్మను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. వారే తమ కుమారైను చంపి చెరువు లో పడేశారనే ఆరోపిస్తూ వారిపై కేసు నమోదు చేయాలని మృతురాలు బంధువులు పోలీసు స్టేషన వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్బంగా సీఐ శివాంజనేయులు, ఎస్‌ఐ రవీంద్రబాబు వారితో మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేసి నిజానిజాలు కనుకొని తగు చర్యలు చేపడతామని ఆందోళన కారులకు సర్ది చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa