జగన్ పరిపాలనలో రాష్ట్ర అభివృద్ధి అధోపాతాళానికి పడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకుంటే రాష్ట్రానికి బిహార్‌కు పట్టిన గతే పడుతుందని మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారె డ్డి చెప్పారు. ప్రకాశం జిల్లా, పామూరు, మండలంలోని నర్రమారెళ్ల గ్రామంలో వైసీ పీ పాలనతో విసిగి వేసారిన పలు కుటుంబాల వారు పామూరు క్లస్టర్ ఇన్‌చార్జి గుంటుపల్లి శ్రీనివాసు లు నేతృత్వంలో గురువారం రాత్రి ఉగ్ర సమక్షంలో 15 కుటుంబాల వారు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఉగ్ర మాట్లాడు తూ టీడీపీ ప్రభుత్వంతోనే రాష్ట్రం, మన పిల్లల భవిష్యత్తుకు బంగా రు బాటలు ఏర్పడతాయని, మరోసారి జగన్ మాటలను నమ్మితే ఇక అంతే సంగతులని చెప్పారు. జగన్ తగ్లక్ పరిపాలనలో సగటు ప్రజ ల జీవనవిధానం అస్తవ్యస్తంగా తయారైందని, సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించారని తెలిపారు. తాను ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, ఓట్లు వేయించుకొని గెలిచిన తరువాత ఎక్కడో ఉండటం రాజకీయం కాదని చెప్పారు. అనంతరం గ్రామంలో టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ముందుగా పా మూరులో ఇంటింటికీ మంచినీరు సరఫరా పేరుతో రోడ్లపైనే ఇనుప పైపులను వేయడం ద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై పంచాయతీ అధికారులకు అర్జీలు ఇవ్వాలని ఉగ్ర సూచించారు.వార్డు మెంబర్లు రామచంద్రరావు, సేరమ్మలు పార్టీలో చేరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa