శ్రీసత్యసాయి జిల్లా ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తిలో కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవ సింహ చౌహన్ ని రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు, కేంద్ర సెన్సార్ బోర్డ్ సభ్యులు, పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జ్ జి. ఎం. శేఖర్ శనివారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవ సింహ చౌహన్ కి శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గం లోని బీజేపీ నాయకులు పాల్గొన్నారు.