మైలవరం మండలం పొన్నంపల్లె గ్రామంలో శనివారం ఇదేం ఖర్మ - మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించిన జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దేవగుడి భూపేష్ సుబ్బ రామిరెడ్డి కి గ్రామ నాయకులు, కార్యకర్తలు బాణ సంచాపేలుస్తూ, పూలమాలవేసి, శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. మొదటగా గ్రామంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం యువకులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ రానున్న ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా చంద్రబాబుని ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరారు. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదన్నారు. నిబంధన పేరుతో లబ్ధిదారులను వేదనకు గురి చేస్తున్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ క్రింద చేరుస్తాము అని చెప్పిన మాట ఏమైందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవగుడి కుటుంబ అభిమానులు పొన్నం పల్లె గ్రామపంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.