పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలోని గండిక్షేత్రంలో శనివారం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఆలయ అర్చకులు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం కావడంతో ఉదయం నుంచే వేలాది మంది భక్తులు గండి క్షేత్రం చేరుకుని ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఇక్కడ ప్రవహిస్తున్న పాపాగ్ని నదిలో స్నానాలు చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలిగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శనివారం కావడంతో భక్తులు అధికసంఖ్యలో వచ్చారని ఆలయ సహాయ కమీషనర్ అలవలపాటి ముకుంద రెడ్డి తెలిపారు.