వేసవిలో మున్సిపల్ ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎర్రగుంట్ల మున్సిపాలిటీ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం కమలాపురం పరిధిలోని ఆదినిమ్మాయి పల్లె వద్ద ఉన్న ఎర్రగుంట్ల మున్సిపల్ నీటి సంపును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ప్రజలకు వేసవికి సరిపడా నీటిని అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఆదినిమ్మాయి పల్లె వద్ద అదనంగా మరొక ఫిల్టర్ ను ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా ఎర్రగుంట్లకు వేసవిలో నీటి సరఫరా జరుగుతుందన్నారు. అంతేగాక పెన్నా నది ఒడ్డున ఉన్న నీటి సంపుల నుంచి ఎర్రగుంట్ల నీటి సరఫరా అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కో ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ రఫీ, మున్సిపల్ ఏఈ సురేష్ తో పాటు ఇతరులు పాల్గొన్నారు.