శ్రీకాకుళం జిల్లా, రైతు సేవా సహకార సంఘం లావేరు, రణస్థలం మండలాల అధ్యక్ష పదవికి కరిమజ్జి భాస్కరరావు శుక్రవారం రాజీనామా చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి సైనికుడిలా కృషి చేశానని, అయినా సరైన గౌరవం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి కొందరు నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత కారణంతోనే ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా పత్రాన్ని ఎఫ్ఎస్సీఎస్ ఎండీ సీహెచ్ మార్కేండయస్వామికి అందించారు.