ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాకు చెందిన సనా ఖాన్, సోనాల్ అనే ఇద్దరు యువతులు 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సోనాల్ కోసం సనా ఖాన్ లింగమార్పిడి రూ.6 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకుని పురుషుడిగా మారింది. అయితే సోనాల్‌కు మరో అబ్బాయితో సంబంధం ఏర్పడటంతో సనాను దూరం పెట్టింది. ప్రాధేయ పడినా వినకపోవటంతో సనా కోర్టును ఆశ్రయించింది. ఈకేసుపై తదుపరి విచారణ ఫిబ్రవరి 23న జరగనుంది.