ఐపీఎల్ జట్టు 'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు' అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. సైబర్ నేరగాళ్లు ఆర్సీబీ ట్విట్టర్ హ్యాండిల్ ను హ్యాక్ చేసి 'Bored Ape Yacht club'గా పేరు మార్చారు. ఈ ఖాతాలో సంబంధంలేని పోస్ట్ లు చేస్తున్నారు. కాగా, అకౌంట్ ను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఆర్సీబీ టీమ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 2021 సెప్టెంబర్ లోనూ ఆర్సీబీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa