ఢిల్లీలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ కు వేధింపులు డ్రామా అంటూ బీజేపీ నేతలు విమర్శించారు. ఇదంతా ఢిల్లీ పోలీసులను చెడుగా చూపించేందుకేనని అన్నారు. దీనిపై మలివాల్ ఘాటుగా స్పందించారు. ‘నా గురించి అబద్దాలు చెప్పి, నన్ను భయానికి గురి చేయాలనుకునే వారికి ఓ విషయం చెప్పాలనుకున్నా. నా గళాన్ని అణచలేరు. జీవించి ఉన్నంత కాలం పోరాడుతుంటా.’ అని ట్వీట్ చేశారు.