రెండో వన్డేలో న్యూజిలాండ్ 108 పరుగులకే ఆలౌటైంది. భారత్‌కు 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌పై భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. మ్యాచ్ ఆరంభంలోనే పరుగుల ఖాతా తెరవకుండానే మహ్మద్ షమీ బౌలింగ్ లో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ లోనే ఫిన్ అలెన్ (0) డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ 8 పరుగుల వద్ద మరో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో నికోల్స్ పెవిలియన్ చేరాడు. 20 బంతులు ఆడిన నికోల్స్ 2 పరుగులు మాత్రమే చేసి గిల్ చేతికి చిక్కాడు. ఈ సమయంలో వెనుదిరిగి బౌలింగ్‌లోకి వచ్చిన షమీ.. డారెల్ మిచెల్ (1)ను అవుట్ చేశాడు. స్ట్రెయిట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మిచెల్.. షమీకే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా తన తొలి ఓవర్‌లోనే డెవాన్ కాన్వాయ్‌ను బౌల్డ్ చేశాడు. కాన్వే యొక్క స్ట్రెయిట్ డెలివరీని పాండ్యా తన ఎడమ చేతితో అద్భుతంగా క్యాచ్ చేశాడు. అనంతరం కెప్టెన్ లాథమ్ శార్దూల్ ఠాకూర్ ఔట్‌తో న్యూజిలాండ్ 15 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.
ఈ సమయంలో బ్రేస్‌వెల్ మరియు గ్లెన్ ఫిలిప్స్ న్యూజిలాండ్‌కు మద్దతు ఇచ్చారు. ఆరో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. బ్రేస్ వెల్ (22)ను 6వ వికెట్ గా ఔట్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ 56 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మిచెల్ సాంట్నర్ ఫిలిప్స్ కు సహకరించాడు. వీరిద్దరూ 7వ వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో న్యూజిలాండ్ వంద పరుగుల మార్కును చేరుకుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ 103 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 27 పరుగులు చేసిన సాంట్నర్ ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. తర్వాత ఫెర్గూసన్ 105 పరుగుల వద్ద ఔటయ్యాడు. టిక్నర్ 108 పరుగుల వద్ద ఔటయ్యాడు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు తీయగా, పాండ్యా, వాషింగ్టన్ సుందర్ తలో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.