చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈశాన్య సరిహద్దులో భారీ వాయు విన్యాసాలకు ఐఏఎఫ్ సిద్ధమైంది. ఎల్ఏసీ సమీపంలో మరికొద్ది రోజుల్లో ‘ప్రళయ్’ పేరుతో విన్యాసాలు చేపట్టనుంది. దీని కోసం డ్రోన్ స్క్వాడ్రన్ ను సరిహద్దు ప్రాంతానికి తరలించడం సహా ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ స్క్వాడ్రన్ ను మోహరించింది. రాఫెల్, సుఖోయ్-30 యుద్ధ విమానాలతో పాటు రవాణా, ఇతర విమానాలతో విన్యాసాలు నిర్వహించనుంది.