చికెన్ కబాబ్ లో ఓ ముక్క తక్కువైందని హోటల్ యజమానిపై ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటన బెంగుళూరులోని కోణనకుంట పోలీస్ స్టేషన్ లో జరిగింది. బుధవారం అర్ధరాత్రి అభి, మణి అనే యువకులు చికెన్ కబాబా పార్శిల్ తీసుకెళ్లగా ఓ ముక్క తక్కువైందని గురువారం ఉదయం హోటల్ యజమానిపై దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.