రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆధ్వర్యంలో 44 రోజుల పాటూ బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ కోర్స్ శిక్షణ పూర్తి చేసుకొని వచ్చిన ఆర్. ఎస్. ఐ, నలుగురు కానిస్టేబుళ్లను విశాఖ నగర పోలీసు కమిషనర్ శ్రీకాంత్ శనివారం అభినందించారు. సీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నగర అర్ముడ్ రిజర్వుకు చెందిన ఆర్. ఎస్. ఐ కే. రామ్ మోహన్ , కానిస్టేబుళ్లు డి. నూకరాజు, టి. జి మహేశ్వరరావు, మహిళా కానిస్టేబుళ్లు టి. శాంతి, జి. మణి శిక్షణ పూర్తి చేసుకుని రావడంతో వారిని సీపీ అభినందించారు. ఉత్తమ ప్రతిభ కనబరచి బెస్ట్ ఆల్ రౌండర్ , ఉత్తమ గ్రేడ్లను సాధించారు. ఈ కార్యక్రమంలో ఎ. డి. సి. పి(ఏ. ఆర్) కే. సుబ్రహ్మణ్యం, ఎ. సి. పి లు (ఏ. ఆర్) ఆర్. పి. ఎల్ శాంతి కుమార్ , ఎ. రాఘవేంద్ర రావు, ఆర్. ఐ సీతరామ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.