తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తీరుతో వడ్డికాసుల వాడిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తుల నడ్డి విరుగుతోంది. అలిపిరి టోల్‌గేటు నుంచి మొదలుపెట్టి ప్రసాదాల వరకూ, బస చేసే గదుల నుంచి స్వామివారి ఆర్జిత సేవల వరకూ... అన్నింటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుచానూరు అమ్మవారి ఆలయంలోనూ ధరల పోటు తప్పడం లేదు. హుండీ ఆదాయం గణనీయంగా పెరిగిపోయిందని పదేపదే ప్రకటనలు జారీ చేసే టీటీడీ ఉన్నతాధికారులు... మరోవైపు ధరలు, అద్దెలు పెంచాల్సిన అవసరమేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.