ప్రజా స్వేచ్ఛని, ప్రశ్నించే గొంతుకలని ఎంత తొక్కి పెడదామని చూసిన ఎంత పెద్ద నియంత అయినా సరే ప్రజాస్పందన ముందు కూలిపోక తప్పదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు హెచ్చరించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... లోకేష్ పాదయాత్ర అనుమతి విషయంలో తాడేపల్లి ప్యాలెస్ తర్జనభర్జనలు పడుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే అతి చిన్న వయసులో పాదయాత్ర చేస్తున్న మొదటి వ్యక్తిగా లోకేష్ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి లోకేష్ పాదయాత్రకు పూర్తిస్థాయి మద్దతు లభిస్తోందని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై, అరాచక పాలనపై లోకేష్ పాదయాత్ర భారతదేశంలోని భవిష్యత్ తరాలకు దిక్సూచిగా ఉంటుందని దేవతోటి నాగరాజు వెల్లడించారు.