ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పద ప్రయోగం చేసి ఇబ్బందుల్లోపడ్డ గీత రచయిత అనంత శ్రీరామ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 22, 2023, 11:28 AM

తాజాగా గీత రచయిత అనంత శ్రీరామ్  ఓ పద ప్రయోగం చేసి సమస్యలు కొని తెచ్చుకొన్నాడు. ఏపీ ప్రభుత్వం భట్రాజు పొగడ్తలు అనే పదబంధాన్ని నిషేధిత జాబితాలో ఉంచింది. అయితే, టాలీవుడ్ గీత రచయిత అనంత శ్రీరామ్ ఇటీవల సంక్రాంతి సంబరాల్లో భట్రాజు పదప్రయోగం చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన దీనిపై బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు. అయినప్పటికీ, అనంతశ్రీరామ్ పై భట్రాజు కులసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 


తాజాగా, అనంత శ్రీరామ్ పై భట్రాజు కుల సంఘాల ప్రతినిధులు అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా అనంత శ్రీరామ్ పాలకొల్లులో సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ కార్యక్రమంలో భట్రాజు పొగడ్తలు అన్న పదాన్ని ఉపయోగించారు. రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన పదాన్ని వాడి తమ వర్గీయులను అనంత శ్రీరామ్ కించపరిచాడంటూ భట్రాజు కులసంఘాలు మండిపడుతున్నాయి. అనంత శ్రీరామ్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com