శ్రీకాకుళం జిల్లా, బెలమర గ్రామానికి చెందిన గొర్లె సత్యం శుక్రవారం రాత్రి తనపై దాడి చేసి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని ఓ గ్రామానికి చెందిన వితంతువు శనివారం పోలాకి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బహిర్భూమికి వెళ్లిన తనపై సత్యం అత్యాచారానికి ప్రయత్నించగా తిరస్కరించానని, దీంతో తన గడ్డి కుప్పను దగ్ధం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యంపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నర్సింహమూర్తి తెలిపారు.