రాష్ట్ర భవిష్యత్ ఉన్నతంగా ఉండాలంటే రానున్న ఎన్నికలలో చంద్రబాబునే ప్రజలు ఎన్నుకోవాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు సామర్లకోట మండలం రావువారిచంద్రంపాలెంలో శనివారం సాయంత్రం ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి పేరిట నిరసన కార్యక్రమాలు మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హజరైన ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ.... వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సామాన్యుల బతుకులు దుర్భరంగా మారాయన్నారు. రాబోయే ఎన్నికలలో చంద్రబా బును ముఖ్యమంత్రిగా గెలిపించాలని ప్రజలను ఎమ్మెల్యే చినరాజప్ప కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తోట కూర శ్రీనివాస్, తలాటం అత్యుతరామయ్య, దమ్మాల బాబ్జీ, డేగల బూరిబాబు, డేగల మురళీకృష్ణ, తలాటం చంటిబాబు, గొల్లపల్లి అన్నవరం, చీకట్ల వెంకటేష్ పాల్గొన్నారు.