రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ జన్మదిన వేడుకలు మింది గ్రామంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి పుట్టిన రోజు ఇది. అమర్నాథ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మింది గ్రామమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. భారీ కటౌట్లు, ఆర్చిలు ఏర్పాటు చేసి కార్యకర్తలు, అభిమానులు అమర్నాథ్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. వివిధ రకాల నృత్య, వాద్య, విచిత్ర వేషధారణలతో మింది గ్రామం మారుమోగిపోయింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. రాత్రి 12 గంటలకు అమర్నాథ్, అతని కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. శనివారం రాత్రి 8 గంటల నుంచి వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమర్నాథ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.