శనివారం అమావాస్య కావడంతో తూర్పు గోదావరిజిల్లా, మందపల్లి శనేశ్వరాలయానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి సర్వ దర్శనాలు, పాటు తైలాభిషేకాలకు క్యూకట్టారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. స్వామివారికి వివిధ రకాల సేవల ద్వారా రూ.2,80,877 ఒక్కరోజు ఆదాయం లభించి నట్టు ఈవో సింగం రాధ తెలిపారు.