సారా తయా ప్రాంతాలపై ఎస్‌ఈబీ సిబ్బంది మెరుపు దాడులు చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్‌ఈబీ అధికారి ఆదేశాల మేరకు శనివారం రాజమహేంద్రవరం సౌత్ ఎస్‌ఈ బీ ఇన్స్‌స్పెక్టర్, ఎస్‌ఈబీ సిఐ, టెక్నికల్ వింగ్ ఎస్‌లు సిబ్బందితో కలిసి దాడుల్లో పాల్గొ న్నారు. ధవళేశ్వరం గ్రామంలో సారా తయారు చేస్తున్న ఐదుగురిని వెంటాడి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సారా తయారీకి వినియోగించే నల్లబెల్లం 432 కేజీలు, ఈస్ట్ 10 కేజీలు, 205 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. 4200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. రెండు గ్యాస్ సిలిండర్లు, 2 గ్యాస్ బర్నర్‌లు, రెండు బైక్‌లు, సారా తయారికి వినియోగించే రెండు పాత్రలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వాటివిలువు సుమారు రూ.3,58,750 ఉంటుందని ఎస్‌ఈబి అధికారులు తెలిపారు. కొప్పిశెట్టి రామకృష్ణ (మోరంపూడి), అత్తిలి శంకర్(పిడింగోయ్యి),బెల్లం సరఫరాదారుమాదారపు సూరిబాబు(శ్రీరాంపురం)లుగా ఎస్‌ఈబీ అధికారులు గుర్తించారు. మట్టా గణేష్ (గుమ్ములూరు), బన్ని(రఘునాథపురం) పర్యారయ్యారు. త్వరలో పరారైన ఇద్దరిని అరెస్టు చేస్తామని ఎస్‌ఈబీ అధికారులు తెలిపారు. అనంతరం రంగంపేట మండలం ఈలకొలనులో దాడులు చేశారు. ఎస్‌ఈబీ అధికారి పిట్టా సోమసుందర్ మాట్లాడుతూ నల్లబెల్లం, తెల్లబెల్లం అక్రమంగా సరఫరా చేసేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఐదు సార్లు పట్టుబడితే పీడీయాక్ట్ నమోదు చేస్తామన్నారు.