బొబ్బిలి మండలం పారాది గ్రామానికి చెందిన యడ్ల సూర్యనారాయణ (55) శనివారం ఉదయం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. మద్యానికి బానిసైన సూర్యనారాయణను కుటుంబ సభ్యులు మందలించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే బొబ్బిలి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సూర్యనారాయణకు భార్య ఆదిలక్ష్మి, కుమారుడు నవీన్ కుమార్ ఉన్నారు. కాగా పెద్ద కుమారుడు నాలుగేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అప్పటి నుంచి తాగుడుకి బానిసైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ చదలవాడ సత్యనారాయణ తెలిపారు.