గుంటూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేట్ లెవెల్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో జరిగే కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అన్నారు. శనివారం ఎస్పీ మాట్లాడుతూ. పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, దళారుల, మాయగాళ్ల, మాటలు విని మోసపోవద్దని సూచించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పరీక్ష కేంద్రాల వద్ద ప్రజలు గూమి గూడటం నిషేధమన్నారు.