గుంటూరు జిల్లాలో, అరుదైన వ్యాధి కారణంగా వికృతంగా మారినా ఓ బాలిక ముఖానికి గుంటూరు జీజీహెచ్ లో శస్త్ర చికిత్సచేసి, తస్లీమ్ ముఖాన్ని తిరిగి పొందేలా చేశారు. షబీనా తస్లిమ్ కు చిన్నతనం నుంచి ముఖంలో ఒకవైపు భాగం వయసుతోపాటు పెరగడం లేదు. తస్లీమ్ ను పరీక్షించి ప్రోగ్రెసివ్ హెమి ఫేషియల్ అట్రోఫీ అనే అరుదైన రుగ్మత ఉందని వైద్యులు గుర్తించారు. శనివారం బాలికకు ఆటోలోగస్ అనే కొవ్వు బదిలీ శస్త్రచికిత్స ని నిర్వహించినట్లు వైద్యులు సుమితా శంకర్ వెల్లడించారు.